Hansika - వైవాహిక జీవితం సూపర్ గా ఉందంట

Hansika - తన వైవాహిక జీవితంపై స్పందించింది హన్సిక. అప్ కమింగ్ సినిమాలపై కూడా రియాక్ట్ అయింది.

Advertisement
Update: 2023-06-28 12:16 GMT

కాస్త గ్యాప్ దొరికితే సోషల్ మీడియాలో చిట్ చాట్ పెడుతుంది హన్సిక. ఇప్పటికే ఎన్నోసార్లు అభిమానులతో సోషల్ మీడియాలో మాట్లాడిన ఈ బ్యూటీ, తాజాగా మరోసారి ఇనస్టాగ్రామ్ లో లైవ్ సెషన్ పెట్టింది. ఈసారి మరిన్ని విశేషాలు మోసుకొచ్చింది. ముఖ్యంగా తన వైవాహిక జీవితం గురించి.

తన వైవాహిక జీవితం సూపర్ గా ఉందని ప్రకటించింది హన్సిక. ఓవైపు సినిమాలు, మరోవైపు ఫ్యామిలీ లైఫ్ తో జీవితం బిజీగా, సంతోషంగా సాగిపోతుందని తెలిపింది. ఈ సందర్భంగా మరికొన్ని విశేషాలు కూడా బయటపెట్టింది. హన్సిక పేరుకు అర్థం ఏంటో బయటపెట్టింది

హన్సిక అంటే హంస అని అర్థం అంట. హంస అంత తెల్లగా తను పుట్టానని, అందుకే ఆ పేరు పెట్టారని తెలిపింది. ఇప్పటికీ అదే అందం మెయింటైన్ చేస్తోంది ఈ ఆపిల్ పిల్ల. ఇక తన ఫేవరెట్ స్పాట్ విషయానికొస్తే.. పారిస్ అంటే తనకు చాలా ఇష్టమని ప్రకటించింది హన్సిక. పారిస్ లో దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేసింది.

కొత్త సినిమాలపై స్పందిస్తూ, జులై 1న తన కొత్త సినిమా ప్రకటన వస్తుందని తెలిపింది. ప్రస్తుతం కోలీవుడ్ లో సినిమాలు చేస్తోంది హన్సిక. తెలుగులో ఆమెకు దాదాపు అవకాశాలు తగ్గిపోయాయి. 

Tags:    
Advertisement

Similar News