Vaishnav Tej - వైష్ణవ్ తేజ్ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ ఫిక్స్

GV Prakash Kumar Vaishnav Tej - వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించబోతున్నాడు. ఆ మూవీ డీటెయిల్స్ మీ కోసం..

Advertisement
Update: 2023-05-11 11:36 GMT

వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జోజూ జార్జ్, అపర్ణ దాస్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాతో రచయితగా, దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. చిత్ర తారాగణంలో లేటెస్ట్ సెన్సేషనల్ టాలెంట్ శ్రీలీలతో పాటు.. ప్రతిభగల నటీనటులు జోజు జార్జ్, అపర్ణా దాస్ చేరడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

తన తొలి చిత్రం 'ఉప్పెన'తో సంచలన విజయాన్ని అందుకుని, అందరినీ ఆకట్టుకున్న పంజా వైష్ణవ్ తేజ్ విభిన్నమైన జోనర్‌లను ఎంచుకుంటున్నాడు. అన్ని రకాల చిత్రాలలో నటిస్తూ, తనలోని నటుడిని విభిన్న కోణాలలో ప్రదర్శించాలని చూస్తున్నాడు. అందుకే ఈసారిమాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాడు.

ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా ప్రకాష్ కుమార్ ను తీసుకున్నారు. ధనుష్‌ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన సర్ సినిమాకు ఇతడే సంగీతం అందించాడు. టీజర్ రిలీజ్ చేసినప్పుడు సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

Tags:    
Advertisement

Similar News