Bhimaa | ఈరోజే గోపీచంద్ మూవీ టీజర్ రిలీజ్

Bhimaa Movie - భీమా అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈరోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది.

Advertisement
Update: 2024-01-05 01:03 GMT

మాచో స్టార్ గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమా’. ఈ చిత్రానికి ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పలు పోస్టర్స్ గోపీచంద్ ను యాక్షన్ లుక్ లో చూపించాయి.

తాజాగా మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు. భీమా టీజర్ ఈరోజు (జనవరి5) విడుదల కానుంది. టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో గోపిచంద్ కుర్చీలో కూర్చున్న లుక్ ఇంటెన్స్ గా ఉంది. ఈ చిత్రంలో గోపిచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో, టెక్నికల్ గా ఉన్నతంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో గోపీచంద్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు.

స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. టీజర్ రిలీజైన తర్వాత సినిమా స్టోరీ ఏంటనేది తెలిసే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News