Viduthalai - మరో డబ్బింగ్ సినిమాపై కన్నేసిన గీతా ఆర్ట్స్

Viduthalai movie - తమిళనాట పెద్ద హిట్టయిన విడుతళై సినిమాను తెలుగులో విడుదల పేరిట రిలీజ్ చేస్తున్నారు.

Advertisement
Update: 2023-04-08 12:51 GMT

కోలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకరైన వెట్రిమారన్ తాజా చిత్రం విడుతలై పార్ట్ 1. వెట్రిమారన్ రచించి, దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మార్చి 31న తమిళనాడుతో పాటు, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో 'గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్' ద్వారా ఏప్రిల్ 15న విడుదల చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. విచారణ పేరుతో మహిళలను చిత్రహింసలకు గురిచేస్తున్న పోలీసులపై పెరుమాళ్ మాస్టర్ (విజయ్ సేతుపతి ) పోరాటం, అతని కోసం పోలీసు బలగాలు వెతకడం గురించి ఈ ట్రైలర్ లో చూపించారు.

సూరి ఈ చిత్రంలో కానిస్టేబుల్ కుమరేశన్ గా నటించాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటించినప్పటికీ, హీరో మాత్రం సూరినే. అన్యాయాన్ని ఆపలేక అతడు పడే సంఘర్షనను కూడా ట్రైలర్‌లో చూపించారు. పెరుమాళ్‌కు ఏం జరుగుతుంది, చివరకు ఎవరు పట్టుకుంటారు అనేది కథ.

వెట్రిమారన్ రియలిస్టిక్ టేకింగ్, అరెస్టింగ్ స్కోర్ మరియు చివర్లో సూరి స్టంట్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. తెలుగులో కాంతార సినిమాను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ. ఈ కంపెనీ ఇప్పుడు విడుదల పార్ట్-1ను రిలీజ్ చేయడానికి రెడీ అవ్వడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.


Full View


Tags:    
Advertisement

Similar News