Satyadev: సత్యదేవ్ సరసన ఫారిన్ బ్యూటీ

సత్యదేవ్ కొత్త సినిమా కోసం ఓ విదేశీ ముద్దుగుమ్మను తీసుకున్నారు. కథ ప్రకారం, విదేశీ బ్యూటీ ఈ సినిమాకు అవసరం అంట. అందుకే ఈ నిర్ణయం.

Advertisement
Update: 2022-11-20 09:09 GMT

సత్యదేవ్‌, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సత్యదేవ్, డాలీ ధనంజయ ఇద్దరికీ ఇది 26వ ప్రాజెక్ట్. నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ల పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదొక క్రిమినల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌.

ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉంది. ఒక హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ ని ఇటివలే ప్రకటించారు. ఈ రోజు మరో హీరోయిన్ పేరుని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా విదేశీ బ్యూటీ జెన్నిఫర్ పిచినెటో ను తీసుకున్నారు. ఈ మేరకు విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో జెనిఫర్ అల్ట్రా మోడరన్ లుక్ లో ఆకట్టుకుంది.

వెటరన్ యాక్టర్ సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కథలో ఆయన పాత్ర చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుందట.

చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టుడియోస్ భారీ బ్యాంక్ సెట్ వేశారు. 

Tags:    
Advertisement

Similar News