Skanda | రామ్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

Skanda movie - స్కంద మూవీ పాటల ప్రమోషన్ మొదలైంది. ఫస్ట్ సింగిల్ రిలీజైంది.

Advertisement
Update: 2023-08-03 17:34 GMT

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ రామ్‌ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. మేకర్స్ ఇప్పుడు సినిమా మ్యూజికల్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఫస్ట్ సింగిల్ "నీ చుట్టు చుట్టు" పాట విడుదలైంది.

కంపోజర్ తమన్ తనదైన స్టయిల్ లో ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడు. సిద్ శ్రీరామ్, సంజన కల్మంజే ఈ పాటను ఆలపించారు. ఈ పాటకు రఘురామ్ రాసిన యూత్‌ఫుల్ లిరిక్స్‌ మరింత ఆకర్షణగా నిలిచాయి. అన్నింటికంటే ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. ఇన్నాళ్లూ మెలొడీ పాటలకు మాత్రమే పరిమితమైన సిద్ శ్రీరామ్, ఈ ఫాస్ట్ బీట్ ను ఆలపించాడు.

రామ్ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. శ్రీలీల, రామ్‌ ఎనర్జీ ని మ్యాచ్ చేసింది. ఇద్దరూ తమ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. కాస్ట్యూమ్స్‌, కలర్‌ఫుల్‌ సెట్‌ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు.

Full View

Tags:    
Advertisement

Similar News