Raashi Khanna | ఎట్టకేలకు ముద్దుగుమ్మకు ఛాన్స్

Raashi Khanna - ముద్దుగుమ్మ రాశీ ఖన్నా ఎట్టకేలకు మరో సినిమా ఆఫర్ అందుకుంది. ఇదేం చిన్న సినిమా కాదు. అంతోఇంతో ప్రతిష్టాత్మక సినిమానే.

Advertisement
Update: 2023-10-17 17:06 GMT

ఏడాది కాలంగా తెలుగు సినిమాల్లో నటించాలని ప్రయత్నిస్తోంది రాశిఖన్నా. పక్కా కమర్షియల్, థ్యాంక్యూ సినిమాల తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలివ్వడానికి అంతా వెనక్కు తగ్గారు. దీంతో మరో సినీ అవకాశం అందుకోవడం రాఖి ఖన్నాకు సవాల్ గా మారింది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకున్న తర్వాత ఆ స్థానం కోసం రాశి ఖన్నా కాస్త గట్టిగానే ప్రయత్నించింది. ఆడిషన్ కూడా ఇచ్చింది. కానీ హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రాశిఖన్నాకు ఛాన్స్ దక్కలేదు. ఆ అవకాశం శ్రీలీలను వరించింది.

ఇలా ఎప్పటికప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. ఎట్టకేలకు ఈమె ప్రయత్నం ఫలించింది. ఓ సినిమాలో అవకాశం అందుకుంది. సిద్ధూ జొన్నలగడ్డ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది.

స్టయిలిస్ట్ నీరజ కోన, దర్శకురాలిగా మారింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెలుసు కదా అనే సినిమా ఎనౌన్స్ చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశిని తీసుకున్నారు. నీరజ, రాశిఖన్నా మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ఆ బాండింగ్ తో రాశికి అవకాశం వచ్చింది.

అయితే ఇక్కడ కూడా ఓ మెలిక ఉంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రాశిఖన్నా కాదు. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్, రాశిఖన్నాది సెకెండ్ హీరోయిన్ పాత్రగా తెలుస్తోంది. ఏదైతేనేం ఎట్టకేలకు వచ్చిన అవకాశం, పైగా పీపుల్ మీడియా లాంటి పెద్ద బ్యానర్. అందుకే రాశిఖన్నా ఒప్పుకుంది.

Tags:    
Advertisement

Similar News