Salman Khan | సల్మాన్ ఖాన్ పేరిట ఈ-మెయిల్స్

Salman Khan - సల్మాన్ ఖాన్ పేరిట మరో మోసానికి తెరలేచింది. అతడి కొత్త సినిమా కోసం నటీనటులు కావాలంటూ కొందరికి ఈమెయిల్స్ వెళ్తున్నాయి.

Advertisement
Update: 2023-07-17 09:29 GMT

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పేరిట కొంతమందికి ఈమెయిల్స్ వెళ్లడం కొత్తేంకాదు. సల్మాన్ పేరిట ఆన్ లైన్ లో ఛీటింగ్స్ చాలానే జరిగాయి. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ కండలవీరుడు పేరిట ఛీటింగ్ చేయడానికి కొంతమంది అగంతకులు రెడీ అయ్యారు. ఈ మేరకు ఇప్పటికే కొంతమందికి ఈ-మెయిల్స్ కూడా వెళ్లాయి.

ఈసారి మాత్రం సల్మాన్ ఖాన్ వెంటనే అలర్ట్ అయ్యాడు. తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా అందరికీ హెచ్చరిక జారీచేశాడు. మరికొందరికి లీగల్ గా వార్నింగ్ ఇచ్చేందుకు కూడా సిద్ధమౌతున్నాడు.

"సల్మాన్ ఖాన్ లేదా సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ తరఫున ఎలాంటి సినిమాకు కాస్టింగ్ కౌచ్ జరగడం లేదు. మా భవిష్యత్ చిత్రాలకు సంబంధించి మేం కాస్టింగ్ ఏజెంట్లను నియమించుకోలేదు. సల్మాన్ సినిమాల్లో నటించే అవకాశం ఇప్పిస్తామంటూ వచ్చే ఈ-మెయిల్స్, మెసేజీలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. సల్మాన్ పేరు లేదా అతడి నిర్మాణ సంస్థ పేరిట ఎవరైనా తప్పుడు చర్యలకు పాల్పడితే వాళ్లకు చట్టపరంగా చర్యలు తీసుకుంటాం."

ఇలా సల్మాన్ ఖాన్ మేనేజర్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చింది. అయితే ఇప్పటికే కొంతమందికి మెయిల్స్ వెళ్లాయి. కొంత డబ్బు కట్టాలని కొందరికి, ముంబయిలోని ఫలానా హోటల్ కు రావాలంటూ మరికొందరికి మెయిల్స్ వెళ్లాయి. సల్మాన్ నుంచి వచ్చిన స్పష్టత వల్ల ఇప్పుడు చాలామంది అప్రమత్తమయ్యే అవకాశం ఏర్పడింది.

Tags:    
Advertisement

Similar News