Extra Ordinary Man OTT | ఓటీటీలోకి నితిన్ సినిమా

Extra Ordinary Man OTT: నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రంగం సిద్దమైంది.

Advertisement
Update: 2024-01-14 15:48 GMT

Extra Ordinary Man OTT: కల్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమా ఓటీటీలోకి వచ్చింది. రిలీజై 3 వారాలు కూడా గడవకముందే ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇప్పుడు మరో ఫ్లాప్ మూవీ కూడా స్ట్రీమింగ్ కు రాబోతోంది. నితిన్ హీరోగా నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమా ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్ధమైంది.

డిసెంబర్ 7న విడుదలైంది ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్. రిలీజ్ డేట్ సరిగ్గా సెట్ అవ్వకపోవడం, నెగిటివ్ టాక్ బలంగా ఉండడం, అదే టైమ్ లో హాయ్ నాన్న గట్టిగా నిలబడ్డం లాంటి కారణాల వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది. నితిన్ కెరీర్ లో ఇది కేవలం ఫ్లాప్ మాత్రమే కాదు, నిర్మాతగా అతడికి పెద్ద దెబ్బ కూడా.

ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వస్తోంది. వచ్చే శుక్రవారం నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కు రాబోతోంది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకుడు. సినిమా విడుదలైన మొదటి రోజే ఫ్లాప్ అయింది. కొన్ని కామెడీ సన్నివేశాలు తప్ప కథలో బలం లేకపోవడంతో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

సీనియర్ హీరో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్‌గా ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. భారీ అంచనాలతో వచ్చిన అతడి పాత్ర కూడా ఎటువంటి ప్రత్యేకత లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలా ఫ్లాప్ అయిన ఈ సినిమా, శుక్రవారం నుంచి ఓటీటీలోకి వస్తోంది.

Tags:    
Advertisement

Similar News