Ravi Teja | సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న రవితేజ

Ravi Teja's Eagle Movie: సంక్రాంతి బరి నుంచి రవితేజ సినిమా తప్పుకుంది. దీంతో సంక్రాంతికి 4 సినిమాలే మిగిలాయి

Advertisement
Update: 2024-01-05 00:45 GMT

Ravi Teja's Eagle Movie: నిన్నటి వరకు సంక్రాంతికి 5 సినిమాలు ఫిక్స్. కానీ ఇప్పుడు సీన్ మారింది. పోటీ 5 నుంచి 4కి తగ్గింది. తప్పుకున్నది రవితేజ. ఈగల్ సినిమా వాయిదా పడింది.

అవును.. సంక్రాంతి రేసు నుంచి ఈగల్ సినిమాను తప్పించారు. మితిమీరిన పోటీని తప్పించేందుకు, తమ సినిమాను సంక్రాంతి రేసు నుంచి బయటకు తీసుకొస్తున్నట్టు స్వయంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. హీరో రవితేజతో సంప్రదించి మరీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

ఈ విషయాన్ని తెలిపేందుకు ఫిలింఛాంబర్ పెద్దలు ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. సంక్రాంతి బరి నుంచి ఏదైనా సినిమా తప్పుకుంటే, దానికి సోలో రిలీజ్ వచ్చేలా ప్రయత్నం చేస్తామని గతంలోనే ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.

చెప్పినట్టుగానే ఈగల్ సినిమాకు, ఆ నిర్మాత కోరినట్టు ఫిబ్రవరి 9 తేదీని కేటాయించారు. ఆ తేదీకి ఆల్రెడీ టిల్లూ స్క్వేర్, యాత్ర-2 సినిమాలున్నాయి. నాగవంశీ తీసిన గుంటూరుకారం ఆల్రెడీ సంక్రాంతి రేసులో ఉంది కాబట్టి, టిల్లూ స్క్వేర్ ను వాయిదా వేయడానికి ఆయన వెంటనే అంగీకరించారు.

ఇక యాత్ర-2కు సంబంధించి పోస్ట్ పోన్ లేదా ప్రీపోన్ చేసే అంశంపై చర్చలు మొదలయ్యాయి. ఈగల్ కు మాత్రం ఫిబ్రవరి 9వ తేదీని ఇచ్చేందుకు అంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు

Tags:    
Advertisement

Similar News