Eagle Movie | రవితేజ సినిమా నుంచి పాటల సందడి షురూ

Eagle Movie - రవితేజ తాజా చిత్రం ఈగల్. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి.

Advertisement
Update: 2023-12-05 15:09 GMT

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతికి రెడీ అవుతోంది. ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు.

గ్రామీణ పండగ వేడుకలు జరుపుకుంటున్న గ్రామస్థులతో కూడిన రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఆడు మచ్చా పాటని ఊర మాస్ అంథమ్ గా కంపోజ్ చేశాడు దావ్‌జాంద్. రవితేజ తన గెటప్, డ్రెస్సింగ్ స్టైల్ పరంగా విభిన్నంగా, మాస్ గా కనిపిస్తున్నాడు. నల్ల చొక్కా, ధోతీ ధరించి, మెడలో రుద్రాక్ష మాలతో పూర్తిగా కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.

కల్యాణ చక్రవర్తి మాస్ ను ఆకట్టుకునే సాహిత్యాన్ని రాశారు. రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్ వాయిస్ తో లైవ్లీ గా పాటని ఆలపించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది. రవితేజ తన డ్యాన్స్ తో పాటలోని ఎనర్జీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాడు. సినిమాలో రవితేజలోని మరో యాంగిల్ ను బయటపెట్టింది ఈ సాంగ్.

ఈ సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా, కావ్య థాపర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. నవదీప్, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్ & దర్శకత్వం వహించాడు. ఈగల్, సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి వస్తోంది.

Full View

Tags:    
Advertisement

Similar News