Weekend Release | ఈ వీకెండ్ డబ్బింగ్ సినిమాలదే హవా

Weekend Release: ఈ వారాంతం డబ్బింగ్ సినిమాలదే హవా. అయలాన్, కెప్టెన్ మిల్లర్ పైనే అందరి దృష్టి.

Advertisement
Update: 2024-01-24 16:28 GMT

ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవుతాంటాయి. కానీ ఈ వీకెండ్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే, సంక్రాంతి తర్వాత చెప్పుకోదగ్గ వీకెండ్ ఇది. అదే రిపబ్లిక్ డే వీకెండ్. పబ్లిక్ హాలిడే కావడంతో పాటు, లాంగ్ వీకెండ్ కలిసిరావడం ఈసారి ప్రత్యేకత.

అయితే ఇలాంటి మంచి డేట్ ను పెద్ద తెలుగు సినిమాలు మాత్రం వదులుకున్నాయి. అన్నీ సంక్రాంతికే పోటీ పడ్డాయి. 2 డబ్బింగ్ సినిమాలకు మాత్రం ఈ వీకెండ్ అద్భుతంగా కలిసిరాబోతోంది. అందులో ఒకటి కెప్టెన్ మిల్లర్ కాగా, రెండోది అయలాన్.

ధనుష్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా కెప్టెన్ మిల్లర్. ఈ సినిమాను సురేష్ బాబు, ఏషియన్ మూవీస్ తెలుగులో భారీగా రిలీజ్ చేస్తున్నారు. అటు శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమా కూడా తెలుగుతెరపైకి భారీగా రాబోతోంది. ఈ రిపబ్లిక్ డే వీకెండ్ కు ఈ రెండు సినిమాలు తెలుగులో బెస్ట్ ఆప్షన్స్ గా మారబోతున్నాయి.

ఈ సినిమాలతో పాటు కొన్ని స్ట్రయిట్ సినిమాలు కూడా వస్తున్నాయి. అయితే అవన్నీ చిన్న సినిమాలే కావడంతో, ప్రేక్షకుల దృష్టి ప్రధానంగా కెప్టెన్ మిల్లర్, అయలాన్ సినిమాలపైనే పడింది. ఈ రెండు సినిమాపపై అందరి దృష్టి పడ్డానికి మరో కారణం ఏంటంటే, ఈ రెండూ కోలీవుడ్ లో ఆల్రెడీ రిలీజై హిట్ సాధించాయి.

Tags:    
Advertisement

Similar News