Double Ismart | ఇవాళ్టి నుంచే రామ్-పూరి కొత్త సినిమా షూట్

Double Ismart Regular Shoot - రామ్, పూరి కలిసి ఇవాళ్టి నుంచే సెట్స్ పైకి వెళ్లబోతున్నారు. డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ షెడ్యూల్ ఈరోజు స్టార్ట్ అవుతుంది.

Advertisement
Update: 2023-07-12 03:18 GMT

రామ్, పూరీ జగన్నాధ్ రెండోసారి కలిసి చేస్తున్న సినిమా 'డబుల్ ఇస్మార్ట్'. ఈ సినిమా తాజాగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూట్ మొదలవుతుంది. హైదరాబాద్ లోనే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. అందులోనే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ముస్తాబయ్యాడు రామ్. ఈ పాత్ర కోసం చిన్న, స్పైక్ హెయిర్‌స్టైల్‌తో స్టైలిష్ లుక్ లోకి మారాడు. మొదటి సినిమాలో అతని మెదడులో చొప్పించిన చిప్‌ను చూపించారు. దాన్ని గుర్తు చేస్తూ, డబుల్ ఇస్మార్ట్ లో కూడా తల వెనుక భాగంలో చిన్న కట్ పెట్టారు.

ఈసారి పూరి జగన్నాధ్ చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ రాశాడట. ఈ సినిమాను ఛార్మితో కలిసి నిర్మిస్తున్నాడు పూరి జగన్నాధ్. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత దాదాపు 11 నెలలు గ్యాప్ తీసుకొని, ఈ కథ రాసుకున్నాడు పూరి.

డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 8న విడుదలౌతుంది.  

Tags:    
Advertisement

Similar News