Gaami | గామి కోసం ఎంత దూరమైనా వెళ్తాం

Gaami Movie - గామి సినిమాను ఐదేళ్లు తీశాడు దర్శకుడు విద్యాధర్. ఈ సినిమా కోసం చాలా దూరం వెళ్లానంటున్నాడు.

Advertisement
Update: 2024-03-05 17:22 GMT

విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్.. వి-సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో దర్శకుడు విద్యాధర్ కాగిత విలేకరుల సమావేశంలో 'గామి' విశేషాలని పంచుకున్నాడు. గామి ప్రాజెక్టు ఎలా మొదలైందో చెప్పుకొచ్చాడు.

"నిజంగా జరిగిన ఓ సంఘటన నన్ను చాలా ఎక్సయిట్ చేసింది. ఆ ఐడియాని రాసిపెట్టుకున్నాను. దీంతో పాటు హిమాలయాలు, మంచు, అక్కడ ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే విఠలాచార్య లాంటి సాహస కథలు ఇష్టం. ఇవన్నీ కలసి ఒక ఆలోచనగా మారాయి. మనకి దొరికిన బడ్జెట్ లో తీసేద్దామనే ఆలోచనతో మొదలుపెట్టాం. క్రౌడ్ ఫండ్ కోసం ఒక పిచ్ వీడియో చేశాం. దాని ద్వారా వచ్చిన డబ్బులతో సినిమాని స్టార్ట్ చేశాం. తర్వాత డబ్బులు అవసరమైతే నిర్మాత బయట నుంచి తీసుకొచ్చారు. తర్వాత ఒక గ్లింప్స్ చూసి యూవీ క్రియేషన్స్ వారు రావడం జరిగింది. నటుల కోసం చూస్తున్నపుడు విశ్వక్ ని అనుకున్నాం. అప్పటికి తన సినిమాలు ఏవీ రాలేదు. రెగ్యులర్ గా ఒక ఆడిషన్స్ లా చేశాం. చాలా ఓపెన్ మైండ్ తో తను ఈ ప్రాజెక్ట్ ని ఎంపిక చేసుకున్నారు. నిజంగా ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి."

ఇలా గామి ప్రాజెక్టు మొదలైన విషయాన్ని చెప్పుకొచ్చాడు దర్శకుడు. ఈ సినిమా కోసం ఐదేళ్లు కష్టపడిన విద్యాధర్, అవతార్ సినిమా కోసం పదేళ్లు కష్టపడ్డారని, కథ డిమాండ్ చేసినప్పుడు ఎన్నేళ్లయినా కష్టపడాల్సిందేనని చెప్పుకొచ్చాడు 

Tags:    
Advertisement

Similar News