ఆడ నెమలి, మగ నెమలి సంసారం.. గరికపాటిని వదలని ఆర్జీవీ..

ఆడ నెమలి, మగ నెమలి భౌతికంగా కలవవు అని అన్నారు. మగ నెమలి కంటిలోనుంచి వచ్చే ద్రవాన్ని ఆడ నెమలి ఆఘ్రానిస్తుందని, అందుకే అది గుడ్లు పెట్టగలుగుతుందని చెప్పారు గరికపాటి.

Advertisement
Update: 2022-10-12 11:21 GMT

చిరంజీవి, గరికపాటి వివాదం మధ్యలో దూరి ట్వీట్లతో రచ్చ రచ్చ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరో ట్వీట్ తో గరికపాటి ప్రవచనాలనే ప్రశ్నించారు. గరికపాటి ప్రవచనాల్లో వాస్తవం ఇదీ అంటూ ఆయన వేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ ట్వీట్లో ఏముంది, అసలు గరికపాటి ప్రవచనం దేని గురించి..?

నెమళ్ల సంసారం..

అస్ఖలిత బ్రహ్మచర్యం అనే విషయంపై ఉపన్యాసం ఇచ్చిన గరికపాటి, శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి అని అందుకే 16వేలమంది గోపికలతో ఆయన సంసారం చేయగలిగారని చెప్పారు. దానికి ఉదాహరణగా నెమలి సంసారం గురించి చెప్పుకొచ్చారు. ఆడ నెమలి, మగ నెమలి భౌతికంగా కలవవు అని అన్నారు. మగ నెమలి కంటిలోనుంచి వచ్చే ఒక ద్రవాన్ని ఆడ నెమలి ఆఘ్రానిస్తుందని, అందుకే అది గుడ్లు పెట్టగలుగుతుందని అన్నారు. అంతేకాని భౌతికంగా వాటి మధ్య ఎలాంటి సంబంధం ఉండదని, అదే అస్ఖలిత బ్రహ్మచర్యం అని చెప్పుకొచ్చారు.

ఈ అస్ఖలిత బ్రహ్మచర్యానికి సైంటిఫిక్ రియాల్టీ ఇది అంటూ.. నెమళ్ల శృంగారానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. మిగతా పక్షులు లాగే నెమళ్ల మధ్య కూడా భౌతిక సంబంధం ఉంటుందని దానికి ఉదాహరణే ఈ వీడియో అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

గరికపాటిని వదిలిపెట్టరా..?

పొరపాటున గరికపాటి, చిరంజీవిపై చూపించిన కోపం ఇప్పుడు ఆయన్ను చుట్టుముట్టింది. అటు చిరంజీవి అభిమానులు, పవన్ కల్యాణ్ అభిమానులు కూడా గరికపాటిని ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఆయన వైఎస్ఆర్ పై చేసిన వ్యాఖ్యలను కూడా ఇప్పుడు తవ్వితీస్తున్నారు కొంతమంది. వైసీపీ అనుకూల సోషల్ మీడియా కూడా గరికపాటిని టార్గెట్ చేసింది. ఈ దశలో రామ్ గోపాల్ వర్మ అనుకోకుండా గరికపాటిని తగులుకున్నారు. తనదైన శైలిలో ఆయనపై, ఆయన ప్రవచనాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News