Adipurush Movie: ఆదిపురుష్‌ వాయిదాపై అధికారిక ప్రకటన

Adipurush Movie release date postponed: ఆదిపురుష్‌ మాత్రం యానిమేషన్ చిత్రాన్ని తలపించేలా కనిపించింది. ట్రైలర్‌కు వచ్చిన రియాక్షన్‌తో దిద్దుబాటు చర్యలను భారీస్థాయిలో చేపట్టింది చిత్రయూనిట్.

Advertisement
Update: 2022-11-07 04:04 GMT

రామాయణం ఆధారంగా, ప్రభాష్ రాముడి పాత్రలో భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఆదిపురుష్‌ అనుకున్నట్టుగానే వాయిదా పడింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ అంచనాలను అందుకోలేకపోయింది. చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. గ్రాఫిక్స్ పూర్తిగా కృత్తిమంగా ఉన్నాయని, పాత్రల వేషధారణ కూడా సరిగా లేదంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. అనేక పెద్ద సినిమాల్లోనూ భారీగా గ్రాఫిక్స్ వాడినా.. పాత్రలు మాత్రం సహజంగానే కనిపించేలా, చెమట చుక్కల నుంచి, నెత్తుటి బొట్టు వరకు సహజంగానే ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఆదిపురుష్‌ మాత్రం యానిమేషన్ చిత్రాన్ని తలపించేలా కనిపించింది. ట్రైలర్‌కు వచ్చిన రియాక్షన్‌తో దిద్దుబాటు చర్యలను భారీస్థాయిలో చేపట్టింది చిత్రయూనిట్.


దిద్దుబాటు చర్యలకు ఏకంగా మరో 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడుతోందని ఆదివారం వార్తలు వచ్చాయి. వాటిని దర్శకుడు ఓం రౌత్‌ సోమవారం ధృవీకరించారు. ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో విజువల్ ఎక్స్‌పీరియన్స్ కల్పించాలన్న ఉద్దేశంతో వర్కింగ్ టీంకు మరింత సమయం కేటాయించాల్సి వస్తోందన్నారు. అందుకే ఈ సినిమాను 2023, జూన్‌ 16న విడుదల చేస్తామని ప్రకటించారు. దేశం గర్వించదగ్గ స్థాయిలో ఈ చిత్రాన్ని అందిస్తామని రౌత్ హామీ ఇచ్చారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News