Dasaradh: నిర్మాతగా మారిన దర్శకుడు దశరథ్

Dasaradh: దర్శకుడు దశరథ్ నిర్మాతగా మారాడు. తన ఫ్రెండ్ తో కలిసి సినిమా ప్రొడ్యూస్ చేశాడు. ఆ మూవీ డీటెయిల్స్ చెక్ చేద్దాం.

Advertisement
Update: 2022-12-04 03:52 GMT

సంతోషం లాంటి సినిమాలతో ఇండస్ట్రీని ఆకర్షించిన దర్శకుడు దశరధ్. ఆ తర్వాత ఆ స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ డైరక్టర్, ఇప్పుడు నిర్మాతగా మారాడు. 'లవ్ యూ రామ్' అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమాకు దశరథ్ కథ అందిస్తే, డీవై చౌదరి దర్శకత్వం వహించాడు.

మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్‌లపై దశరథ్, డీవై చౌదరి ఈ సినిమాను నిర్మించారు. రోహిత్ బెహల్ హీరోగా నటిస్తుండగా, అపర్ణ జనార్దనన్ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. దర్శకుడు వీవీ వినాయక్ ఈ ఫస్ట్ లుక్ లాంచ్ చేశాడు.

జనాల్లో స్ఫూర్తిని నింపే కథతో, ప్రస్తుత జనరేషన్ కు కావాల్సిన సందేశంతో వస్తోంది లవ్ యు రామ్ సినిమా. ప్రేమించడమే జీవితం అని నమ్మే అమ్మాయి, నమ్మించడమే జీవితం అని భావించే అబ్బాయి మధ్య జరిగే ప్రేమ కథ ఇది. ఈ కథలో దశరధ్ బ్రాండ్ కనిపిస్తుంది.

ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టేజ్ లో ఉంది. వేద సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కిషోర్ గోపు స్క్రీన్ ప్లే సమకూర్చాడు. త్వరలోనే మూవీ విడుదల తేదీని ప్రకటిస్తారు.

Tags:    
Advertisement

Similar News