Dimple Hayathi: తెలుగమ్మాయిలు రావాలి

Dimple Hayathi: టాలీవుడ్ లోకి మరింతమంది తెలుగమ్మాయిలు రావాలంటోంది డింపుల్ హయతి. ప్రస్తుతం పరిస్థితులు బాగా మారాయని చెబుతోంది.

Advertisement
Update: 2023-04-27 05:44 GMT

Dimple Hayathi: తెలుగమ్మాయిలు రావాలి

టాలీవుడ్ లో పరిస్థితులు మారాయంటోంది హీరోయిన్ డింపుల్ హయతి. రామబాణం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ బ్యూటీ, తెలుగమ్మాయిలకు టాలీవుడ్ లో ఆదరణ పెరుగుతోందని అంటోంది. ప్రస్తుతం తెలుగమ్మాయి శ్రీలీల వరుస అవకాశాలతో దూసుకుపోతోందని, తనకు కూడా మంచి అవకాశాలు వస్తున్నాయని అంటోంది.

డింపుల్ హయతి తండ్రిది తమిళనాడు, తల్లిది విజయవాడ. ఈమె హైదరాబాద్ లో పుట్టిపెరిగింది. తను పక్కా తెలుగమ్మాయిననని, తనకు కూడా అవకాశాలు రావడం గొప్పగా ఉందని చెబుతోంది. అయితే మరింతమంది తెలుగమ్మాయిలు ఈ ఫీల్డ్ లోకి రావాలని, అప్పుడే ఇండస్ట్రీలో పరిస్థితులు మారినట్టు అవుతుందని చెబుతోంది.

టాలీవుడ్ లో తెలుగమ్మాయిలు క్లిక్ అయిన సందర్భాలు చాలా తక్కువ. మొన్నటికిమొన్న ఇషా రెబ్బా విషయంలో ఇదే జరిగింది. కేవలం తెలుగమ్మాయిని అనే అక్కసుతోనే చాలామంది తనకు అవకాశాలు ఇవ్వలేదంటూ ఇషా రెబ్బా బాధపడింది. స్వాతి, లయ లాంటి చాలామంది తెలుగు హీరోయిన్లు ఈ విషయంలో వివక్ష ఎదుర్కొన్నారు.

అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయని అంటోంది డింపుల్. మరో నలుగురు తెలుగమ్మాయిలు ఫీల్డ్ లోకి వస్తే అప్పుడిక పండగ చేసుకోవచ్చని చెబుతోంది.

Tags:    
Advertisement

Similar News