Dil Raju | సంక్రాంతి సినిమాలకు దిల్ రాజు ఓపెన్ ఆఫర్

Dil Raju - సంక్రాంతి బరిలో పోటీని తగ్గించేందుకు, ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఫిలింఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు. ఇంతకీ ఏంటా ఆఫర్?

Advertisement
Update: 2023-12-25 16:31 GMT

ప్రతి సంక్రాంతికి పోటీ కామన్. ఈ సంక్రాంతికి కూడా పోటీ ఉంది. కాకపోతే సంక్రాంతి బరిలో 2 లేదా 3 సినిమాలు పోటీ పడుతుంటాయి. ఈసారి ఏకంగా 5 సినిమాలు బరిలో నిలిచాయి.

అందుకే ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు, సంక్రాంతి సినిమాల నిర్మాతలతో భేటీ అయ్యారు. ఒకరు లేదా ఇద్దరు పోటీ నుంచి తప్పుకోవాలని కోరారు. అలా తప్పుకున్న సినిమాకు రాబోయే రోజుల్లో సోలో రిలీజ్ డేట్ ఇస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.

నిజంగా ఇది మంచి ఆఫర్ కింద లెక్క. ఎందుకంటే, ప్రస్తుత పరిస్థితుల్లో సోలో రిలీజ్ అనేది దాదాపు అసాధ్యంగా మారింది. సలార్ లాంటి పెద్ద సినిమాలకు తప్ప, మిగతా సినిమాలకు సోలో రిలీజ్ అనేది అసంభవంగా మారింది.

సో.. సంక్రాంతి బరి నుంచి ఏదైనా సినిమా వెనక్కు తగ్గితే, రాబోయే రోజుల్లో ఫిలింఛాంబర్ తరఫున ఆ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని తెలిపారు దిల్ రాజు. సమ్మర్ సీజన్ లో కూడా కొన్ని ఖాళీ డేట్స్ ఉన్నాయని, వాటిని కేటాయింటే అవకాశం ఉందని ఊరించారు.

ఈ సంక్రాంతికి గుంటూరుకారం, సైంధవ్, హను-మాన్, నా సామిరంగా, ఈగిల్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఏ సినిమా వెనక్కు తగ్గుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే 5 సినిమాలూ రేసులో ఉన్నాయి

Tags:    
Advertisement

Similar News