Captain Millar | ఈ నెలలోనే ధనుష్ సినిమా టీజర్

Dhanush's Captain Millar - కెప్టెన్ మిల్లర్ సినిమా శరవేగంగా ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు.

Advertisement
Update: 2023-07-25 17:33 GMT

నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న భారీ పీరియాడికల్ మూవీ “కెప్టెన్ మిల్లర్”. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా గుర్తింపు పొందింది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సత్యజ్యోతి ఫిలింస్‌ బ్యానర్ పై తెరకెక్కుతోంది.

ఇటివలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో అప్ డేట్ తో ముందుకొచ్చింది కెప్టెన్ మిల్లర్ మూవీ. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న'కెప్టెన్ మిల్లర్' టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. కెప్టెన్ మిల్లర్ టీజర్ జూలై 28న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్‌ కుమార్‌, సందీప్‌ కిషన్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇలా భారీ తారాగణంతో వస్తోంది కెప్టెన్ మిల్లర్ సినిమా.

ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాజు. 'కెప్టెన్ మిల్లర్’ సినిమాను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సర్ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. ఆ సినిమాతో సక్సెస్ కూడా కొట్టాడు. దీంతో కెప్టెన్ మిల్లర్ సినిమాకు టాలీవుడ్ లో డిమాండ్ పెరిగింది.

Tags:    
Advertisement

Similar News