Devara movie | కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన దేవర

Devara October 10 Release - దేవర సినిమా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ ప్రకటించారు. దసరా కానుకగా సినిమా వస్తోంది.

Advertisement
Update: 2024-02-16 17:10 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం ‘దేవర’. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి మాస్ అవతార్‌లో తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో అలరించబోతున్నాడు. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించబోతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10న విడుదల కాబోతోంది.

నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేశారు. సైఫ్ గాయపడ్డంతో, షూటింగ్ వాయిదా పడింది. దీంతో తాజాగా అక్టోబర్ 10 తేదీని ప్రకిటంచారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది దేవర-1.

రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ హై లెవెల్లో ఉండబోతోన్నాయని, ఎన్టీఆర్‌ను మరింత మాస్ కారెక్టర్‌లో చూపించబోతోన్నారని అర్థమైంది.

ఇది వరకే రిలీజ్ చేసిన దేవర గ్లింప్స్ ఏ రేంజ్‌లో ట్రెండ్ అయిందో.. సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ‘దేవర’ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. 

Tags:    
Advertisement

Similar News