Devara | ఎర్ర సముద్రంలో దేవర

Devara Glimpse - ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. విజువల్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి.

Advertisement
Update: 2024-01-08 15:52 GMT

ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం ‘దేవర’. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో అలరించబోతున్నారు. ‘దేవర పార్ట్ 1’ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 5న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది.

ఈ రోజు దేవర గ్లింప్స్‌ విడుదల చేశారు. ఈ వీడియోలో విజువల్స్, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. వీడియో గ్లింప్స్‌ను గమనిస్తే అందులో సముద్రం, ఓడలతో పాటు రక్తంతో నిండిన ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఇంతకు ముందెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ‘దేవర’గా ఎన్టీఆర్ నటన, లుక్ చూస్తుంటే పులి గాండ్రిస్తున్నట్లే అనిపిస్తోంది. కొరటాల శివ రూపొందించిన సరికొత్త భారీ ప్రపంచం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

దేవర పాత్ర కోసం ఎన్టీఆర్ తనదైన నటనతో, ప్రతీ భాషలో డైలాగ్‌ను ఆయన పలికిన తీరు చూస్తే వావ్ అనాల్సిందే. రక్తంతో తడిసిన డి ఆకారంలోని ఆయుధాన్ని ఎన్టీఆర్ శుభ్రం చేస్తూ, ‘ఈ సముద్రం చేపల కంటే రక్తాన్నే ఎక్కువగా చూసింది అందుకనే దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ఆ సముద్రం పేరు బయటపెడతాడు.

అనిరుద్ అంతర్జాతీయ స్థాయి సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ ఈ గ్లింప్స్ ను అందంగా తీర్చిదిద్దాయి. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Full View

Tags:    
Advertisement

Similar News