Dear Movie | మరో డిఫరెంట్ సినిమా

Dear Movie - డియర్ మూవీ డబ్బింగ్ సినిమానే కావొచ్చు. కానీ ట్రయిలర్ రిలీజ్ అయిన తర్వాత అందర్నీ ఆకర్షిస్తోంది.

Advertisement
Update: 2024-04-07 17:02 GMT

జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా 'డియర్' తమిళంలో ఏప్రిల్ 11న, తెలుగులో ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు.

నాగ చైతన్య వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రయిలర్ లో నూతన వధూవరుల పాత్రల్లో జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ కనిపించారు. భార్య గురక అలవాటు కారణంగా రిలేషన్ షిప్ లో ఇబ్బందులు ఎదుర్కొనే భర్త కథ ఇది. కథాంశం కొత్తగా ఉంది. నాగచైతన్య వాయిస్ ఓవర్ ట్రయిలర్ కు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిచాడు. ట్రయిలర్ కు అతడు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేయనుండగా, ఏషియన్ సినిమాస్ నైజాంలో విడుదల చేయనుంది. ఏప్రిల్ 12న సినిమా విడుదలకానుంది.

Full View

Tags:    
Advertisement

Similar News