Dhamaka Movie: ధమాకాలో ఆ ట్రాక్ హైలెట్ అంట

Dhamaka Movie: రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ధమాకా. ఈ సినిమాలో రావురమేష్, హైపర్ ఆది మధ్య వచ్చే కామెడీ ట్రాక్ టోటల్ సినిమాకే హైలెట్ అంటున్నాడు దర్శకుడు.

Advertisement
Update: 2022-12-17 12:25 GMT

ధమాకాతో మరోసారి దర్శకుడిగా ప్రేక్షకులముందుకొస్తున్నాడు దర్శకుడు త్రినాధరావు నక్కిన. కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈ డైరక్టర్, ధమాకా కూడా తన స్టయిల్ లోనే ఉంటుందంటున్నాడు. సినిమాలో యాక్షన్ ఎంత ఉంటుందో, కామెడీ కూడా అంతే ఉంటుందట. మరీ ముఖ్యంగా రావు రమేష్, హైపర్ ఆది ట్రాక్ హైలెట్ అని చెబుతున్నాడు.

"ధమాకా లో జయరామ్ విలన్ గా చేశారు. ఆయన ఇది వరకూ విలన్ గా చేశారు. ఎక్కువగా సాఫ్ట్ విలనీ ఉంటుంది. ఇందులో మాత్రం కంప్లీట్ నెగిటివ్ రోల్. ఆయన ఇంత నెగిటివ్ రోల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. విలన్ గా ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. ఇక కామెడీ విషయానికొస్తే, పాత సినిమాల్లో రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య ట్రాక్స్ ను ఎంత ఎంజాయ్ చేస్తామో.. ధమాకాలో రావు రమేష్, హైపర్ ఆది ట్రాక్ అంతే అద్భుతంగా ఉంటుంది. వీరి ట్రాక్ ఆద్యంతం అలరిస్తుంది."

ఇక సినిమా ట్రయిలర్ లో త్రివిక్రమ్ పై వేసిన పంచ్ గురించి కూడా మాట్లాడాడు త్రినాధరావు నక్కిన. ఆ పంచ్ త్రివిక్రమ్ కు కూడా బాగా నచ్చిందని, ఫోన్ చేసి మరీ అభినందించారని అన్నాడు.

ఈనెల 23న థియేటర్లలోకి వస్తోంది ధమాకా సినిమా. రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో అతడి సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది.




Tags:    
Advertisement

Similar News