నవ్వుల ' రాజు ' ఇక లేరు

రాజ శ్రీ వాస్తవ.... హాస్య ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు..`ద గ్రేట్ ఇండియ‌న్ లాఫ్ట‌ర్ చాలెంజ్`(The Great Indian Laughter Challenge) సిరీస్‌ ద్వారా ప్రేక్షకుల హృదయాలలో చిరస్థానం సాధించుకున్న కమెడియన్.

Advertisement
Update: 2022-09-21 06:22 GMT

రాజ శ్రీ వాస్తవ.... హాస్య ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు..`ద గ్రేట్ ఇండియ‌న్ లాఫ్ట‌ర్ చాలెంజ్`(The Great Indian Laughter Challenge) సిరీస్‌ ద్వారా ప్రేక్షకుల హృదయాలలో చిరస్థానం సాధించుకున్న కమెడియన్.

అంతే కాదు, ఉత్తర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేేషన్ చైర్మన్ కూడా ఈ నవ్వుల రాజు ఆగస్టు నెల పదో తేదీ జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పోయారు.

కుటుంబ సభ్యులు, సహచరులు అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నాటి నుంచి చికిత్స పొందుతూ నేటి ఉదయం ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు. శ్రీ వాస్తవ డైలాగ్ చెప్పే తీరే నవ్వు తెప్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన మిమిక్రీ కళాకారుడు కూడా. వింతైన స్వరం, అభినయంతో ప్రేక్షకులను తనదైన హాస్యం పండించారు. ఈయన మరణంతో సినీ , టివి రంగ కళాకారులు విషాదంలో మునిగి పోయారు.

Tags:    
Advertisement

Similar News