Viswambhara | సంక్రాంతికి చిరంజీవి సినిమా

Viswambhara Movie - చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ విశ్వంభర. ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Advertisement
Update: 2024-02-02 16:58 GMT

చిరంజీవి తాజా చిత్రం విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇప్పుడీ సినిమా నుంచి ఒకేసారి 2 అప్ డేట్స్ వచ్చాయి. రెండూ క్రేజీ అప్ డేట్సే.

విశ్వంభర సినిమా ఈరోజు నుంచి సెట్స్ పైకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సెట్స్ లో అడుగుపెట్టారు. ఇక ఇదే రోజున సినిమా విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విశ్వంభర సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సోషియా ఫాంటసీ కథతో తెరకెక్కుతోంది విశ్వంభర మూవీ. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా వస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. సినిమాలో హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని ఇఁకా ప్రకటించలేదు.

పంచభూతాల కాన్సెప్ట్ తో వస్తున్న విశ్వంభర సినిమాపై చిరంజీవి చాలా హోప్స్ పెట్టుకున్నారు. తన శక్తింతా ఈ సినిమా కోసం వెచ్చిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కసరత్తులు చేసి బరువు తగ్గుతున్నారు. చిరంజీవి ఇందులో సరికొత్తగా కనిపించబోతున్నారు. 




Tags:    
Advertisement

Similar News