Miss Shetty Mr Polishetty | అనుష్క సినిమాకు 'మెగా' ప్రశంసలు

Miss Shetty Mr Polishetty | మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను ప్రత్యేకంగా చూశారు చిరంజీవి. సినిమాను మెచ్చుకున్నారు.

Advertisement
Update: 2023-09-06 03:57 GMT

న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాను ఆద్యంతం తనను ఆకట్టుకుందని, ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ ను ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెబుతున్నారు చిరంజీవి. నవీన్ పోలిశెట్టి, అనుష్క నటనను మెగాస్టార్ మెచ్చుకున్నారు.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేశారంటూ హీరో నవీన్ పోలిశెట్టి, యూవీ క్రియేషన్స్ విక్కీ, డైరెక్టర్ పి.మహేశ్ బాబును అభినందించారు.

చిరంజీవి ఏమన్నారంటే.. "మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తూ తీసిన సరికొత్త కధాంశం, జాతిరత్నాలు కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా అనూష్క శెట్టి లు ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ అవ్వడంతో, పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా తీశాడు డైరెక్టర్ మహేశ్ బాబు. ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్ లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది."

యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రేపు, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Tags:    
Advertisement

Similar News