Mega156 | చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం

Chiranjeevi and Vassishta - వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే కొత్త సినిమా ఈరోజు లాంఛనంగా మొదలైంది.

Advertisement
Update: 2023-10-23 15:14 GMT

విజయ దశమి సందర్భంగా చిరంజీవి కొత్త సినిమా స్టార్ట్ అయింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వశిష్ఠ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగాయి. యూవీ క్రియేషన్స్ ఆఫీస్ లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

కెరీర్ లో చిరంజీవికి ఇది 156వ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత చిరు చేస్తున్న సోషియా ఫాంటసీ సినిమా ఇది. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తరహాలో ఈ సినిమాలో ఫాంటసీ అంశాలతో పాటు దైవాంశాలు కూడా ఉండబోతున్నాయి. పంచభూతాల కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతోందనే విషయాన్ని మూవీ ఎనౌన్స్ మెంట్ టైమ్ లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

భోళాశంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి తన సినిమాల ఆర్డర్ మార్చారు. కూతురు నిర్మాణంలో చేయాల్సిన సినిమాను పక్కనపెట్టారు. అదే టైమ్ లో వశిష్ఠ చెప్పిన కథకు ఓకే చెప్పారు. ఇప్పుడు ఆ సినిమానే స్టార్ట్ చేశారు. బింబిసారతో వశిష్ఠ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

వశిష్ఠ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ప్రీ-ప్రొడక్షన్ వర్క్, గ్రాఫిక్స్ కు ఎక్కువ టైమ్ పడుతుంది. భారీ సెట్స్ కావాలి, షూటింగ్ కు కూడా ఎక్కువ కాల్షీట్లు అవసరం. అందుకే కాస్త ముందుగానే ఈ సినిమా స్టార్ట్ చేశారు చిరంజీవి. ఈ మూవీతో పాటు త్వరలోనే మరో సినిమాను కూడా ప్రారంభిస్తారు. వశిష్ట సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈరోజు సినిమాకు కొబ్బరికాయ కొట్టి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు.

Tags:    
Advertisement

Similar News