Silk Smitha | తెరపైకి సిల్క్ స్మిత బయోపిక్, ఫస్ట్ లుక్ రిలీజ్

Silk Smitha - వెండితెరపైకి సిల్క్ స్మిత బయోపిక్ రాబోతోంది. సిల్క్ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకొని మరీ ఈ బయోపిక్ ను తెరకెక్కించబోతున్నారు.

Advertisement
Update: 2023-12-02 15:08 GMT

80, 90వ దశకాల్లో సౌత్ ను ఓ ఊపు ఊపిన గ్లామరస్ బ్యూటీ సిల్క్ స్మిత. సిల్క్ సాంగ్ ఉందంటే, ఆ సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ వచ్చేది. కేవలం ఆమె డాన్స్, అందచందాలు చూసేందుకు థియేటర్లకు వచ్చేవాళ్లు ఓ సెక్షన్ ఆడియన్స్. అప్పట్లో ఆమె బిగ్గెస్ట్ క్రౌడ్-పుల్లర్‌.

సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. ఆమె జయంతి పురస్కరించుకొని సిల్క్ స్మిత బయోపిక్‌ను అనౌన్స్ చేశారు దర్శకుడు జయరామ్. ఇటీవల 'వీరసింహారెడ్డి' సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో అలరించిన చంద్రిక రవి, సిల్క్ స్మిత క్యారెక్టర్ చేస్తోంది. ఎస్‌టిఆర్‌ఐ సినిమాస్‌ పై విజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ ప్రత్యేక సందర్భంలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించడమే కాకుండా, మేకర్స్ చంద్రిక రవి పాత్రను సిల్క్ స్మితగా పరిచయం చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అచ్చు సిల్క్ స్మితలానే కనిపించింది చంద్రిక రవి. చీర ధరించి, నుదిటిపై బొట్టు, మత్తు కళ్ళుతో గోళ్లు కొరుకుతూ ప్రజెంట్ చేసిన లుక్ లో సిల్క్ స్మితలా ప్రేక్షకులని మురిపించింద చంద్రిక రవి.

సిల్క్ స్మిత కుటుంబ సభ్యుల అనుమతితో ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది పాన్ ఇండియా లెవెల్లో సినిమాను విడుదల చేస్తారు.

Tags:    
Advertisement

Similar News