Chandini Chowdary | గామి నుంచి చాందిని ఫస్ట్ లుక్ రిలీజ్

Chandini Chowdary - గామి సినిమాలో విశ్వక్ సేన్ సరసన నటించింది చాందినీ చౌదరి. ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

Advertisement
Update: 2024-02-22 17:30 GMT

విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ అడ్వెంచర్ డ్రామా 'గామి' థియేట్రికల్ ట్రైలర్ మరో వారంలో ఫిబ్రవరి 29న విడుదల కానుంది. వెరీ టాలెంటెడ్ చాందినీ చౌదరి ఈ సినిమాలో హీరోయిన్.

ఈరోజు పోస్టర్ ద్వారా చాందిని పాత్రను జాహ్నవిగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. చాందిని కళ్లజోడుతో ఆకర్షణీయంగా ఉన్న ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె వీధుల్లో నడుస్తూ కనిపించింది. చాందినితో పాటు విశ్వక్ చేసిన సాహస యాత్రను సినిమాలో అద్భుతంగా చూపించనున్నారు.

మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడే అఘోరా పాత్రలో విశ్వక్ సేన్ నటించాడు. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రానికి క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ సమర్పిస్తుంది.

ఈ చిత్రానికి నరేష్ కుమారన్ మ్యూజిక్ అందిస్తుండగా.. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే రాశారు. గామి మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    
Advertisement

Similar News