BRO Movie | మొదటి రోజు బ్రో సంపాదించింది ఎంత?

BRO Movie Day-1 Collection - పవన్ కల్యాణ్, సాయి తేజ్ హీరోలుగా నటించిన సినిమా బ్రో. మొదటి రోజు ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు చూద్దాం..

Advertisement
Update: 2023-07-29 13:53 GMT

BRO Movie Trailer | పవన్ సినిమా ట్రయిలర్ వచ్చేస్తోంది

ఊహించినట్టుగానే బ్రో సినిమాకు యావరేజ్ వసూళ్లు వచ్చాయి. ఓపెనింగ్స్ లో పవన్ కల్యాణ్, తన గత చిత్రాన్ని కూడా దాటలేకపోయాడు. బ్రో సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల 40 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ సినిమాపై జరిగిన బిజినెస్ ను దృష్టిలో పెట్టుకుంటే ఇది తక్కువే.

గతంలో పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాకు మొదటి రోజు 24 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ నంబర్ ను కూడా బ్రో సినిమా దాటలేకపోయింది. ఇక మిగతా హీరోల సినిమాల ఓపెనింగ్స్ తో కంపారిజన్ అనవసరం.

బ్రో సినిమాకు వసూళ్లు తగ్గడానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. వీటిలో పైకి కనిపిస్తున్న కారణం.. ఏపీ,నైజాంలో ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచలేదు. ఇక పైకి కనిపించని మరో కారణం.. బ్రో సినిమా కమర్షియల్ మూవీ కాదు, దీంతో బజ్ రాలేదు. సినిమాకు వసూళ్లు తగ్గడానికి ప్రధానంగా ఈ రెండే కారణాలు.

రానున్న రోజుల్లో కూడా ఈ సినిమాకు వసూళ్లు తగ్గే ప్రమాదం ఉంది. ఎఁదుకంటే, సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. దీంతో ఆక్యుపెన్సీ తగ్గే అవకాశం ఉంది. మొదటి రోజు ఈ సినిమాకు ఏపీ-నైజాంలో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం - 6.86 కోట్లు

సీడెడ్ - 2.60 కోట్లు

ఉత్తరాంధ్ర - 2.21 కోట్లు

గుంటూరు - 2.13 కోట్లు

ఈస్ట్ - 2.18 కోట్లు

కృష్ణా - 1.02 కోట్లు

వెస్ట్ - 2.80 కోట్లు

నెల్లూరు - 0.60 కోట్లు

టోటల్ షేర్ - 20.40 కోట్లు (జీఎస్టీతో కలిపి 22.96 కోట్లు)

Tags:    
Advertisement

Similar News