Bholaa Shankar | భోళాశంకర్ రీమేక్ కాదంటున్న తమన్న

Bholaa Shankar Tamanna - భోళాశంకర్ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది తమన్న. ఈ సినిమా మక్కికి మక్కి రీమేక్ కాదని చెబుతోంది.

Advertisement
Update: 2023-07-31 11:37 GMT

మెగాస్టార్ చిరంజీవీ, భోళా శంకర్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు భోళా శంకర్ తో మరో హిట్ కు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. మూవీ విడుదలకు దగ్గరపడుతుండటంతో, పాటలు విడుదల చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

మూవీలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. రీమేక్ అనగానే ఫ్యాన్స్ చాలా భయపడ్డారు. రీమేక్ మూవీ అంటే, జిరాక్స్ దింపి ఉంటారని చాలా మంది భావిస్తున్నారు. దీనిపై తమన్నా స్పందించింది. వేదాళం మూవీని సీన్ టూ సీన్ కాపీ చేయలేదని క్లారిటీ ఇచ్చింది తమన్న.

దర్శకుడు మెహర్ రమేష్ ఈ మూవీ మొత్తాన్ని రీ-క్రియేట్ చేశారట. తమిళ వేదాళం మూవీ చూసిన అనుభూతి అస్సలు కలగదని చెబుతోంది. తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా ఈ మూవీని తెరకెక్కించారంటున్న తమన్నా... మూవీ పూర్తిగా సిస్టర్ సెంటిమెంట్ తో సాగుతుందని క్లారిటీ ఇచ్చింది.

ఈ మూవీలో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ నటించింది. ఆగస్టు 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా అది సూపర్ హిట్టయింది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News