Bhagavanth Kesari | బాలయ్య పాటల ప్రచారం షురూ

Bhagavanth Kesari - బాలయ్య కొత్త సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రేపు రిలీజ్ అవుతోంది.

Advertisement
Update: 2023-08-31 14:16 GMT

ప్రీ-గణేష్ చతుర్థి వేడుకలు ప్రారంభమయ్యాయి, ‘భగవంత్ కేసరి’ మేకర్స్ గణేష్ సాంగ్ పాట ప్రోమోను విడుదల చేశారు. మాస్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, శ్రీలీల.. బాబాయ్, అమ్మాయిగా కనిపించారు.

అనిల్ రావిపూడి ప్రతి సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. భగవంత్ కేసరిలో బాలకృష్ణ, శ్రీలీల బాబాయ్, అమ్మాయిగా కనిపించనున్నారు. వీరిద్దరి అనుబంధం గణేష్ సాంగ్ ప్రోమో ద్వారా రివీల్ అయ్యింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు, మాస్, తీన్మార్ నంబర్‌తో మ్యూజిక్ ప్రమోషన్‌లు ప్రారంభమయ్యాయి. రేపు ఈ ఫుల్ సాంగ్ ను విడుదల చేస్తున్నారు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు.

దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది. ఈలోగా పాటలతో సందడి చేయాలని భావిస్తున్నారు. అనీల్ రావిపూడి ప్రతి సినిమాలో పాటలు, విడుదలకు ముందే హిట్టయ్యాయి. ఆ మేజిక్ ను భగవంత్ కేసరి రిపీట్ చేస్తుందా లేదా అనేది రేపు తేలిపోతుంది.

Full View

Tags:    
Advertisement

Similar News