Bhagavanth Kesari | బాలయ్య సినిమా ప్రచారానికి ముహూర్తం ఫిక్స్

Bhagavanth Kesari - బాలయ్య సినిమా ప్రచారానికి ముహూర్తం లాక్ అయింది. ఓ మాస్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement
Update: 2023-08-25 05:51 GMT

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ విడుదలకు సిద్ధమైంది. గణేష్ అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు.

బాలకృష్ణ గత చిత్రం 'అఖండ'కు ఎక్స్ టార్డినరి మ్యూజిక్ అందించిన తమన్, భగవంత్ కేసరి కోసం కూడా సెన్సేషనల్ ఆల్బమ్‌ రెడీ చేశాడటం. పోస్టర్ లో చెప్పినట్టుగా ఇది మాస్ నంబర్ అవుతుంది. పోస్టర్‌లో మాస్ ప్లస్ క్లాస్ లుక్ లో కనిపిస్తున్నాడు బాలయ్య. డ్రమ్స్ కొడుతూ హుషారుగా ఉన్నాడు.

ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ అలరించాడు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది.

నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో అతడు విలన్ గా నటించాడు

దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.

Tags:    
Advertisement

Similar News