Sreeleela | శ్రీలీల కెరీర్ లో మైలురాయి

Sreeleela - బాలయ్యతో కలిసి భగవంత్ కేసరి సినిమా చేసింది శ్రీలీల. ఈ మూవీ ఆమె కెరీర్ లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

Advertisement
Update: 2023-10-20 17:07 GMT

బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా శ్రీలీలకి మైల్ స్టోన్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీలీల మెరిసింది. ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రంగా భగవంత్ కేసరి నిలుస్తుంది.

భగవంత్ కేసరి కంటే ముందు విడుదలైన అన్ని సినిమాల్లోనూ ఆమెను అందరూ డ్యాన్స్‌లు, రొమాంటిక్ సన్నివేశాలకే పరిమితం చేశారు. అందుకే శ్రీలీల నటించలేదని, మరీ ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌ని హ్యాండిల్ చేయలేదని నెగిటివ్ బజ్ వచ్చింది. అయితే భగవంత్ కేసరి సినిమాతో తనకు యాక్టింగ్ టాలెంట్ కూడా ఉందని నిరూపించుకుంది శ్రీలీల.

సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ అదిరింది. ముఖ్యంగా ఆర్మీ శిక్షణ సన్నివేశాలలో, సెకండాఫ్ లో బాలయ్యతో వచ్చే కాంబినేషన్ సీన్స్ లో శ్రీలీల హైలెట్ అయింది. భగవంత్ కేసరి, విజ్జి పాప మధ్య బంధాన్ని చూపించే క్రమంలో శ్రీలీల చక్కగా నటిచింది.

ఈ సినిమా బాక్సాఫీస్‌ రిజల్ట్ ను పక్కన పెడితే, భగవత్ కేసరి ఆమె కెరీర్‌లో ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. స్కంద సినిమాలో శ్రీలీల పాత్రపై చాలా విమర్శలొచ్చాయి. ఆమెకు మంచి సీన్స్ పడలేదని, పైగా ఆమెకు యాక్టింగ్ కూడా రాలేదన్నారు చాలామంది. ఆ విమర్శల్ని భగవంత్ కేసరితో తిప్పికొట్టింది ఈ బ్యూటీ. భగవంత్ కేసరిలో శ్రీలీల ఎంపిక పెర్ ఫెక్ట్ అంటున్నారంతా.

Tags:    
Advertisement

Similar News