Veerasimha Reddy: కుర్చీ నుంచి లేవకుండా ఫైట్ చేశాడంట

Veerasimha Reddy: బాలయ్య హీరోగా నటిస్తున్న వీరసింగారెడ్డి సినిమాలో ఓ ఛైర్ ఫైట్ ఉందంట. అది సినిమాకు హైలెట్ అంటున్నారు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు.

Advertisement
Update: 2022-12-31 15:50 GMT

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయి. అందులో ఒక ప్రత్యేకతను బయటపెట్టారు పైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్. వీరసింహారెడ్డి సినిమాలో కుర్చీ ఫైట్ ఒకటి ఉందట.

"ఫైట్ కి కాన్సెప్ట్ ఉండాల్సిందే. లేకపోతే ఫైట్ కి పరిపూర్ణత రాదు. ఫైట్ అనేది ఎప్పటినుండో ఉన్నప్పటికీ ప్రేక్షకుడికి బోర్ కొట్టదు. ఒక ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ అది. హీరో క్యారెక్టరైజేషన్ కు కొత్తదనాన్ని యాడ్ చేసి ఒక కాన్సెప్ట్ ఫైట్ ని కంపోజ్ చేయడం వలనే థియేటర్ లో ప్రేక్షకులు విజల్స్, చప్పట్లు కొట్టిమరీ ఎంజాయ్ చేస్తారు. క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ ప్రకారం కూడా యాక్షన్ డిజైన్ చేయాలి. వీరసింహారెడ్డిలో బాలయ్య చైర్ లో కూర్చుని ఉంటారు. ఎదురుగా రౌడీలు వస్తుంటారు. బాలయ్య బాబు క్యారెక్టరైజేషన్ ప్రకారం.. ఈ రౌడీలని కూడా నిల్చునికొట్టాలా అనే ఆలోచన వచ్చింది మాకు. దీంతో బాలయ్య చైర్ లో కూర్చునే ఒక పవర్ ఫుల్ ఫైట్ ని కంపోజ్ చేశాం. చైర్ లో కూర్చునే ఫైట్ చేయొచ్చు అనే మూడ్ చాలా అద్భుతంగా క్రియేట్ అయింది. అది బాలయ్య క్యారెక్టరైజేషన్ లో ఉన్న మేజిక్"

ఇలా వీరసింహారెడ్డి సినిమాలో ఓ ఎట్రాక్షన్ ను బయటపెట్టారు రామ్-లక్ష్మణ్ మాస్టర్లు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్. తమన్ సంగీత దర్శకుడు.




Tags:    
Advertisement

Similar News