Bhairava Dweepam | బాలకృష్ణ నుంచి మరో రీ-రిలీజ్

Balakrishna's Bhairava Dweepam | బాలకృష్ణ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటి భైరవ ద్వీపం. ఇప్పుడీ సినిమా మరోసారి థియేటర్లలోకి రానుంది.

Advertisement
Update: 2023-07-25 17:37 GMT

బాలకృష్ణ, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో వచ్చిన అద్భుత చిత్రం భైరవ ద్వీపం. ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించి, ప్రేక్షకులను అందులోకి తీసుకువెళ్లిన ‘భైరవద్వీపం’ చిత్రం 1994లో ఏప్రిల్ 14న విడుదలైంది. ఫాంటసీ చిత్రాల్లో క్లాసిక్ గా నిలిచింది ఈ మూవీ.

తాజాగా 29 ఏళ్లు పూర్తి చేసుకొని, 30వ ఏట అడుగుపెట్టింది ఈ సినిమా. ఈ సందర్భంగా భైరవద్వీపం సినిమాను మరోసారి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటితరం ప్రేక్షకులకు, అప్పటి విజువల్ వండర్ ను పరిచయం చేయాలనుకుంటున్నారు క్లాప్స్ ఇన్ఫొటైన్ మెంట్స్ నిర్మాతలు.

ఇప్పటి తరం కోసం భైరవద్వీపం సినిమాను 4K రిజల్యూషన్ లోకి మార్చి, సౌండ్ ను అప్ గ్రేడ్ చేసి, ఆగస్ట్ 5వ తేదీన విడుదల చేస్తున్నారు. ఫాంటసీ కథల్ని ఇష్టపడేవారు, బిగ్ స్క్రీన్ పై ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.

రావి కొండలరావు ఈ సినిమాకు కథ అందించారు. ఇలాంటి కథల్ని అద్భుతంగా తెరకెక్కించగల సింగీతం శ్రీనివాసరావు, భైరవద్వీపం ను డైరక్ట్ చేయడంతో పాటు, స్వయంగా స్క్రీన్ ప్లే కూడా అందించారు. మాధవపెద్ది సురేష్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలైట్.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ కబీర్ లాల్ అందించారు. ఆయన కెమెరా పనితనం అడుగడుగునా కనిపిస్తుంది. ఇప్పటి గ్రాఫిక్స్ ను తలదన్నేలా, అప్పట్లో కెమెరాతో జిమ్మిక్కులు చేశారు కబీర్ లాల్. చందమామ విజయ కంబైన్స్ బ్యానర్‌పై నిర్మాత బి. వెంకటరామి రెడ్డి నిర్మించిన ఈ సినిమా, ఏకంగా 9 నంది అవార్డులు గెలుచుకుంది.

Tags:    
Advertisement

Similar News