Balakrishna | దసరా ముందు దంచుదాం

Balakrishna - భగవంత్ కేసరి సినిమాపై పూర్తి విశ్వాసం ప్రకటించాడు బాలయ్య. దసరాకు ముందు దంచుదాం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు.

Advertisement
Update: 2023-10-09 02:06 GMT

భగవంత్ కేసరి హంగామా మొదలైంది. ట్రయిలర్ లాంఛ్ తో ఈ సినిమా ప్రచారం పీక్స్ కు చేరుకుంది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ ను వరంగల్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ కొన్ని ఆసక్తికర ప్రకటనలు చేశాడు. దసరా ముందు దంచుదాం అంటూ సినిమాపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు.

కెరీర్ లో తను ఎప్పుడూ ప్రయోగాలు చేయడానికి వెనకాడలేదన్న బాలయ్య.. భగవంత్ కేసరి సినిమా కోసం కూడా తను ఓ ప్రయోగం చేశానని, అదేంటో సినిమా చూస్తే అందరికీ అర్థమౌతుందని తెలిపాడు. అంతేకాదు, కెరీర్ లో తొలిసారి పూర్తిస్థాయిలో తెలంగాణ యాసలో మాట్లాడే పాత్ర కూడా చేశానని, తన యాస-భాష అందరికీ నచ్చుతుందని అన్నాడు.

సినిమాలో తన మార్క్ తో పాటు, అద్భుతమైన డైలాగ్స్ కూడా ఉన్నాయని, దర్శకుడు అనీల్ రావిపూడి, అందరికీ నచ్చేలా భగవంత్ కేసరి సినిమాను తెరకెక్కించాడని చెప్పిన బాలకృష్ణ.. దసరా ముందు దంచుదాం అంటూ ప్రకటించారు. తన ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా, ప్రతి తెలుగు ప్రేక్షకుడికి భగవంత్ కేసరి సినిమా నచ్చుతుందని అన్నాడు.

ఈ సినిమా ట్రయిలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. తొలిసారి ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కాజల్ బయటకొచ్చింది. సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన కాజల్, ట్రయిలర్ లాంఛ్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక శ్రీలీల, అచ్చమైన తెలుగమ్మాయిలా సంప్రదాయ దుస్తుల్లో కనిపించి ఆకట్టుకుంది.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కింది భగవంత్ కేసరి సినిమా. ఇందులో బాలయ్య బాబాయ్ గా, శ్రీలీల అతడికి కూతురు వరుస పాత్రలో కనిపించింది. అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు. తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజయ్యాయి. త్వరలోనే మరో మాస్ సాంగ్ రాబోతోంది. 

Tags:    
Advertisement

Similar News