BAAK Movie | సైలెంట్ గా వాయిదా పడిన బాక్

BAAK Movie - బాక్ మూవీ వాయిదా పడింది. ఈ నెలలో సినిమా థియేటర్లలోకి రావడం లేదు.

Advertisement
Update: 2024-04-19 17:26 GMT

అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాలుగో చిత్రం అరణ్మనై 4 తెలుగులో 'బాక్' పేరుతో వస్తోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేయడానికి ముందుగా సన్నాహాలు చేశారు మేకర్స్. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండటం వలన విడుదల తేదీని వాయిదా వేశారు. మే 3న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తాజాగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.

అంతా బాగానే ఉంది కానీ, సినిమా వాయిదా పడ్డానికి మండే ఎండల్ని సాకుగా చూపించడం మాత్రం కామెడీగా ఉంది. ఏప్రిల్ 26న వాయిదా వేసి, మే 3కు రిలీజ్ చేస్తే ఎండలు తగ్గిపోతాయా? అసలైన రీజన్ చెప్పినా సరిపోయేది. ఎండలు పెరిగాయని చెప్పి వాయిదా వేసి, ఎండలు బాగా ముదిరే టైమ్ లో రిలీజ్ చేయడం కామెడీగా ఉంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'పంచుకో' పాట అద్భుతమైన రెస్పాన్స్ తో చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. త్వరలోనే ట్రైలర్ ని విడుదల చేసి తెలుగు ప్రమోషన్స్ ని దూకుడుగా చేయబోతున్నారు మేకర్స్. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.

Tags:    
Advertisement

Similar News