Avatar 2 Box Office Collection: వీకెండ్ బాక్సాఫీస్.. అవతార్-2 సినిమాదే హవా

Avatar 2 Box Office Collection: నిన్నటితో సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది అవతార్-2 సినిమా. మరి ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లు ఎలా ఉన్నాయి.

Advertisement
Update: 2022-12-19 04:04 GMT

Avatar: The Way of Water Trailer

ఊహించినట్టుగానే అవతార్ 2 ది వే ఆప్ వాటర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్టయింది. ఏపీ, నైజాంలో ఈ సినిమాకు ఆక్యుపెన్సీ స్టడీగా ఉంది. విడుదలైన ఈ 3 రోజుల్లో అవతార్ 2 సినిమా ఎక్కడా తగ్గలేదు.

విడుదలైన మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ నమోదు చేసిన అవతార్2 సినిమా.. రెండో రోజైన శనివారం, మూడో రోజైన ఆదివారం చెరో 11 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఫలితంగా మొదటి వారాంతం ఈ సినిమాకు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే 35 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చింది.

ఏపీ,నైజాంలో ఈ సినిమా హవా ఈ శుక్రవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. ధమాకా, 18-పేజెస్ వచ్చిన తర్వాత అవతార్ 2 కు ఆటోమేటిగ్గా స్క్రీన్ కౌంట్ తగ్గుతుంది. అయితే బిగ్ స్క్రీన్స్, 3డీ వెర్షన్లలో ఈ సినిమా హవా తగ్గేలా లేదు.

వరల్డ్ వైడ్ ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేయలేకపోయింది. డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవెర్స్, అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలు వీకెండ్ వసూళ్లలో బెస్ట్ అనిపించుకున్నాయి. అవతార్-2 సినిమా మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News