Allu Arjun | బన్నీతో సినిమాపై అట్లీ రియాక్షన్

Atlee Allu Arjun - అల్లు అర్జున్ తో అట్లీ సినిమా చేస్తున్నాడా? దీనిపై స్వయంగా స్పందించాడు అట్లీ.

Advertisement
Update: 2023-09-17 17:24 GMT

అల్లు అర్జున్, అట్లీ కలిసి సినిమా చేయబోతున్నారా? పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిన బన్నీ, జవాన్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన అట్లీతో చేతులు కలిపాడా? త్వరలోనే ఈ కాంబినేషన్ పై ప్రకటన రానుందా? ఎప్పుడైతే జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయిందో, అప్పట్నుంచి ఈ పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి.

ఎట్టకేలకు అల్లు అర్జున్ తో సినిమాపై స్పందించాడు అట్లీ. తామిద్దరి మధ్య ఓ పాయింట్ పై చర్చ జరిగిన విషయం నిజమేనని అంగీకరించాడు. అయితే ఎప్పుడు చేద్దాం, ఎలా చేద్దాం అనే అంశాలపై ఇంకా నిర్ణయానికి రాలేదని ప్రకటించాడు. అయితే అల్లు అర్జున్ తో సినిమా చేయాలనే కోరికను మాత్రం బయటపెట్టాడు అట్లీ.

ప్రస్తుతం జవాన్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు అట్లీ. ఇప్పటికిప్పుడు మరో ప్రాజెక్ట్ ను తను పట్టాలపైకి తీసుకురాలేనని స్పష్టం చేశాడు. కొన్నాళ్ల పాటు తన కొడుకుతో గడిపి, ఆ తర్వాత కొత్త కథపై రచన ప్రారంభిస్తానని తెలిపాడు.

ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే, ప్రస్తుతం పుష్ప-2 షూట్ లో బిజీగా ఉన్నాడు బన్నీ. ఈ మూవీ తర్వాత అతడి లిస్ట్ లో త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లలో ఒకరికి ఛాన్స్ ఇస్తాడా లేక అట్లీతో కలిసి సెట్స్ పైకి వెళ్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 

Tags:    
Advertisement

Similar News