Ashok Galla | సితార బ్యానర్ పై అశోక్ సినిమా

Ashok Galla - మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి వచ్చిన అశోక్ గల్లా, ఇప్పుడు మరో సినిమాతో రెడీ అవ్వబోతున్నాడు. సితార సంస్థ నిర్మించనుంది.

Advertisement
Update: 2024-04-06 09:17 GMT

యువ కథానాయకుడు అశోక్ గల్లా తన తదుపరి చిత్రం కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో చేతులు కలిపాడు. సితార బ్యానర్ పై 27వ చిత్రంగా ఇది రాబోతోంది. లవ్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమా రాబోతోంది. చిత్ర ప్రకటనకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్‌ ను బట్టి చూస్తే.. ఈ చిత్ర కథ అమెరికా నేపథ్యంలో సాగుతుందని అర్థమౌతోంది.

"ది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ"తో కూడిన పోస్టర్ డిజైన్ ఆకట్టుకుంటోంది. నేటి తరం యువతకు అద్దం పట్టే కథతో ఈ సినిమా వస్తోందంట.

'ప్రేమమ్', 'భీష్మ', 'భీమ్లా నాయక్', 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' వంటి విజయవంతమైన చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమాలను అందించే నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. అలాంటి సితార సంస్థ నుంచి వస్తున్న సినిమా కాబట్టి, ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.

నిర్మాతలు ఇంకా ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు. 'మ్యాడ్' మూవీ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. ఉద్భవ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 




Tags:    
Advertisement

Similar News