Ashish | లవ్ మీ కోసం ముందస్తు షూటింగ్

Ashish - ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’.

Advertisement
Update: 2024-05-23 08:28 GMT

ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించాడు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ట్యాగ్ లైన్. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచవ్యాప్తంగా మే 25న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి హీరో మాట్లాడాడు.

"డైరెక్ట‌ర్ అరుణ్ ఓ న‌వ‌లా ర‌చ‌యిత‌. చాలా నెమ్మ‌ద‌స్తుడు. త‌ను స్టోరీని చ‌క్క‌గా నెరేట్ చేస్తాడు. ‘ల‌వ్ మీ’ స్టోరీని ఆయ‌న నాకు చెప్పిన‌ప్పుడు నా క్యారెక్ట‌ర్‌ను వివ‌రించిన తీరు నాకు బాగా న‌చ్చింది. ప్ర‌తీ విష‌యాన్ని ఒక్కొక్క‌రు ఒక్కోలా చూస్తార‌నే కాన్సెప్ట్ నచ్చింది. అలాగే దెయ్యంతో మాట్లాడ‌టం, రొమాన్స్ చేయ‌టం .. వంటి ఎలిమెంట్స్ డిఫ‌రెంట్‌గా అనిపించాయి. ముందు డైరెక్ట‌ర్ రాసుకున్న క‌థ‌ను చెప్పింది చెప్పిన‌ట్లు తీస్తాడా అనే అనుమానం వచ్చింది. అందుక‌ని ముందు 15 రోజులు షూటింగ్ చేద్దాం, బాగా వ‌చ్చిందంటే ముందుకెళ‌దాం.. లేక‌పోతే ఇంకా బెట‌ర్‌మెంట్ చేసుకుని వెళ‌దామ‌ని నిర్ణ‌యించుకున్నాం. 15 రోజుల త‌ర్వాత ఔట్‌పుట్ చూస్తే కొన్ని సీన్స్‌లో అయితే గూజ్ బ‌ంప్స్ వ‌చ్చాయి.. నేచుర‌ల్‌గా కొన్ని సీన్స్ వ‌చ్చాయనిపించింది. దీంతో సినిమాను కంటిన్యూ చేశాం."

ఇలా లవ్ మీ కోసం 2 వారాలు షూట్ చేసి సంతృప్తి చెందిన తర్వాతే ముందుకెళ్లామనే విషయాన్ని బయటపెట్టాడు ఆశిష్. ఈ సినిమా క్లయిమాక్స్ లో మంచి ట్విస్ట్ ఉంటుందని, స్టోరీ పరంగా సీక్వెల్ చేయడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ లవ్ మీ సినిమాకు ఉన్నాయని చెబుతున్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News