Ashika Ranganath - నాగార్జున సరసన అమిగోస్ బ్యూటీ

Ashika Ranganath - తెలుగులో రెండో సినిమాకు సైన్ చేసింది అషికా రంగనాధ్. అమిగోస్ తర్వాత ఆమె 'నా సామిరంగ'లో నటిస్తోంది.

Advertisement
Update: 2023-12-05 14:11 GMT

తన దశాబ్దాల కెరీర్‌లో ఎందరో దర్శకులను పరిచయం చేసిన నాగార్జున అక్కినేని తన తాజా చిత్రం 'నా సామి రంగ'తో మరో నూతన దర్శకుడు విజయ్ బిన్నీకి అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్ గా నటిస్తుండగా, తాజాగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.

పోస్టర్ ద్వారా 'వరలక్ష్మి'గా పరిచయమైన ఆషికా రంగనాథ్ సాంప్రదాయ దుస్తుల్లో ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించింది. ఆషికా అద్దం ముందు నిల్చుని తన అందాన్ని చూస్తుండగా.. బయట నుంచి బీడీ తాగుతూ నాగార్జున ఆమెను గమనిస్తుంటాడు. ఈ వీడియోను విడుదల చేశారు.

ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ వీడియోకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. వీడియోలో నాగార్జున మాస్ గా కనిపించగా, ఆషికా రంగనాథ్ లంగావోణీలో క్లాస్ గా ఆకట్టుకుంటోది. కొరియోగ్రాఫర్‌గా ఉన్న విజయ్ బిన్నీ ఆషికను చాలా చక్కని హావభావాలతో ప్రజెంట్ చేశాడు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ని త్వరలో విడుదల చేస్తారు. నాగార్జున, కీరవాణి, చంద్రబోస్‌ కాంబినేషన్ లో సాంగ్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ‘నా సామి రంగ’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.

Full View

Tags:    
Advertisement

Similar News