Ashika Ranganadh | నా సామిరంగ.. వరాలు వచ్చేసింది

Ashika Ranganadh - సంక్రాంతి హీరోయిన్ గా మారింది అషికా రంగనాధ్. నా సామిరంగ సినిమాలో తన పాత్ర చాలా బాగుంటుందని చెబుతోంది.

Advertisement
Update: 2024-01-10 15:47 GMT

కింగ్ నాగార్జున తాజా ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం, ప్రచారంతో అందర్నీ ఆకట్టుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ ఆషిక రంగనాథ్, తన పాత్ర గురించి మాట్లాడింది.

"ఈ సినిమాలో వరాలు అనే అమ్మాయి పాత్ర పోషించాను. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హీరోయిన్ పాత్రలు కొంచెం సున్నితంగా ఉంటాయి. కానీ వరాలు పాత్ర మాత్రం రెబల్. ఈ సినిమా చూసిన తర్వాత అమ్మాయి అంటే ఇలా ఉండాలనే భావన కలిగించే పాత్ర ఇది. అలాంటి పాత్ర చేయడం చాలా ఎక్సయిటింగా అనిపించింది."

సినిమాలో తనకు నాగార్జునకు మంచి రొమాన్స్ ఉందని చెప్పుకొచ్చింది వరాలు అలియాస్ అషికా రంగనాధ్. తమ కెమిస్ట్రీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతోంది. ఇక నాగ్ తో పాటు.. రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కూడా 2 లవ్ ట్రాక్స్ ఉన్నాయని, అవి కూడా చాలా బాగా వచ్చాయని చెబుతోంది.

గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉండే పాత్రలంటే తనకు ఇష్టమంటున్న అషియా రంగనాధ్, ఎప్పటికైనా రాజమౌళి దర్శకత్వంలో నటించాలనేది తన కోరికగా చెప్పుకొచ్చింది.

Tags:    
Advertisement

Similar News