Saindhav Movie | షాకింగ్.. సైంధవ్ లో వెంకీతో పాటు మరో హీరో

Arya Saindhav - సైంధవ్ లో వెంకీ మాత్రమే హీరో అనుకున్నాం. కానీ ఈ సినిమాలో ఆర్య కూడా ఉన్నాడు.

Advertisement
Update: 2023-08-30 17:28 GMT

విక్టరీ వెంకటేష్‌ 75వ మైల్ స్టోన్ మూవీ ‘సైంధవ్‌’. శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 8 మంది కీలక నటీనటుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇప్పటివరకు 7 పాత్రలను పరిచయం చేశారు. తాజాగా సినిమాలోని మరో కీలక పాత్రను రిలీవ్ చేశారు.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కోలీవుడ్ స్టార్ ఆర్య ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రను మానస్‌గా పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఫార్మల్ దుస్తుల్లో, చేతిలో మెషిన్ గన్‌తో కనిపిస్తున్నాడు ఆర్య. సైంధవ్ సినిమాలో వెంకీ మాత్రమే హీరో అనుకున్నారంతా. కానీ ఓ కీలక పాత్రలో మరో హీరో ఆర్య కూడా ఉన్నాడన్నమాట.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేకర్స్ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రలను పరిచయం చేయడానికి ఒక గ్లింప్స్ విడుదల చేశారు. వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా, సారా, జయప్రకాష్ వీడియోలో కనిపించారు.

ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా అన్ని దక్షిణాది భాషలతో పాటు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది సైంధవ్.

Tags:    
Advertisement

Similar News