Rajadhani Files | రిలీజైన తర్వాత ఆగిపోయిన సినిమా

Rajadhani Files Movie: ఈరోజు థియేటర్లలోకి వచ్చింది రాజధాని ఫైల్స్. విడుదలైన తర్వాత ఈ సినిమాపై స్టే పడింది.

Advertisement
Update: 2024-02-15 16:56 GMT

Rajadhani Files Movie: ఈరోజు రాజధాని ఫైల్స్ అనే సినిమా రిలీజైంది. విడుదలైన తర్వాత హైకోర్టు దీనిపై స్టే విధించింది. దీంతో ఆఘమేఘాల మీద సినిమాను ఆపేశారు. కొన్ని థియేటర్లలో సినిమా ప్రసారం అవుతుంటే, మధ్యలో ఆపేశారు. హైకోర్టు ఆదేశానుసారం సినిమా ప్రసారం ఆపేస్తున్నట్టు థియేటర్ల బయట బోర్డులు పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అప్రతిష్టపాలు చేసేందుకు, సీఎంను పోలిన వ్యక్తితో సినిమా తీసి, రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీసేలా వ్యవహరించారంటూ, వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఈ మేరకు విచారణ చేపట్టిన ధర్మాసనం, సినిమా విడుదలను నిలిపివేసింది. సినిమాకు సంబంధించి రికార్డులతో పాటు, ఓ కాపీని కోర్టును సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఈ సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. రివ్యూ కమిటీ తుది నివేదిక ఇచ్చి సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేసింది. అయినప్పటికీ కోర్టు జోక్యంతో మూవీ విడుదల నిలిచిపోయింది. అమరావతి రాజధాని అంశం చుట్టూ తిరిగే కథతో తీసిన ఈ మూవీని నిలిపివేయడంపై గుంటూరు జిల్లా ఉండవల్లిలో రైతులు ఆందోళన చేపట్టారు. సినిమాను తిరిగి ప్రసారం చేయాలని ధర్నా చేశారు. 

Tags:    
Advertisement

Similar News