Miss Shetty Mr Polishetty - మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్రయిలర్ రివ్యూ

Miss Shetty Mr Polishetty - నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది.

Advertisement
Update: 2023-08-21 16:57 GMT

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. చాన్నాళ్ల కిందటి ప్రాజెక్టు ఇది. ఈ సినిమా కథ ఏంటనే విషయం అప్పుడే బయటకొచ్చింది. హీరోను పెళ్లి చేసుకోకుండానే, అతడి ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని హీరోయిన్ భావిస్తుంది. ఈ సినిమా లైన్ ఇదే అనే విషయాన్ని గతంలోనే వెల్లడించాం.

సినిమాలో అత్యంత కీలకమైన ఈ లైన్ ను దాచడానికి యూనిట్ కూడా ప్రయత్నించలేదు. ఈరోజు రిలీజైన ట్రయిలర్ లో సినిమా కథేంటనే విషయాన్ని క్లియర్ గా చెప్పేశారు. హీరో ఇంజనీరింగ్ చదివి స్టాండప్ కమెడియన్ అవుతాడు. హీరోయిన్ చెఫ్ గా వర్క్ చేస్తుంటుంది. కానీ ఆమెకు పెళ్లికి సదాభిప్రాయం లేదు. పిల్లలు మాత్రం కావాలనుకుంటుంది.

తను కోరుకునే లక్షణాలున్న అబ్బాయి కోసం వెదుకుతున్న క్రమంలో హీరోను చూస్తుంది హీరోయిన్. అతడి ద్వారా బిడ్డను కనేందుకు ప్రయత్నిస్తుంది. హీరో మాత్రం హీరోయిన్ ను సిన్సియర్ గా ప్రేమిస్తాడు. వీళ్లిద్దరి జీవితాలు ఏ మలుపు తిరిగాయనే విషయాన్ని సినిమా చూసి తెలుసుకోవాలి.

ఈరోజు రిలీజ్ చేసిన ట్రయిలర్ లో ఇలా దాదాపు కథ మొత్తం చెప్పేశారు. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి పాత్రలు మాత్రమే కాదు, మిగతా కీలక పాత్రలన్నింటినీ బయటపెట్టేశారు. ఇలా సినిమాపై అనవసరపు అంచనాలు పెంచకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారనుకోవాలి.

లాంగ్ గ్యాప్ తర్వాత కనిపించిన అనుష్క తన లుక్స్ తో ఆకట్టుకుంది. నవీన్ పొలిశెట్టి ఎప్పట్లానే ఎనర్జిటిక్ గా, హ్యూమరస్ గా కనిపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. "సీసీటీవీ కెమెరాలున్నాయక్కడ, వైరల్ అయిపోతావ్" అనే డైలాగ్ తో ట్రయిలర్ ను ముగించడం బాగుంది.

మహేష్ బాబు దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 7న విడుదల చేయబోతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కింది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా.

Full View

Tags:    
Advertisement

Similar News