ప్రయోగాలు ఇష్టమంటున్న ముద్దుగుమ్మ

ప్రయోగాలు చేయడం ఇష్టమంటోంది అనుపమ పరమేశ్వరన్. తనను ఛాలెంజ్ చేసే పాత్రలు పోషించడం ఇష్టం అంటోంది.

Advertisement
Update: 2022-08-15 08:00 GMT

రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు చేయడం తనకు ఇష్టం లేదని ఓపెన్ గా చెబుతోంది అనుపమ పరమేశ్వరన్. అలా అని హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు మాత్రమే చేస్తానని అనడం లేదు. మాస్ హీరో సినిమాలైనా, అందులో తన పాత్రకు అంతోఇంతో ప్రాధాన్యం ఉంటే చేస్తానని చెబుతోంది.

"నేను ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాను. నాకొచ్చే పాత్రలు ఛాలెంజింగ్ గా ఉండాలి. అలాంటి పాత్రలు నాకు నచ్చుతాయి. ఒక ఆర్టిస్ట్ గా ఎన్ని భాషల్లో కుదిరితే అన్ని భాషల్లో చేయాలని ఉంది. అలా చేయడం వల్ల నా కెరీర్ స్పాన్ పెరుగుతుంది, మనసుకు తృప్తిగా కూడా ఉంటుంది."

కార్తికేయ2 సినిమాలో ముగ్ద పాత్ర పోషించింది అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమాలో కొన్ని సందర్భాల్లో హీరోను డామినేట్ చేసింది. దీనిపై స్పందించిన అనుపమ, కథకు తగ్గట్టుగా తను నటించాను తప్ప, తన పాత్రకు వెయిట్ ఉండాలని ఎప్పుడూ డిమాండ్ చేయనని చెప్పుకొచ్చింది. కార్తికేయ2 మొత్తం నిఖిల్ సినిమాగానే చెప్పుకొచ్చింది.

ఈమె నుంచి త్వరలోనే బట్టర్ ఫ్లై, 18-పేజెస్ అనే రెండు సినిమాలు రాబోతున్నాయి. వీటితో పాటు మరో 2 సినిమాలు లైన్లో ఉన్నాయి. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తానంటోంది ఈ మల్లూ బ్యూటీ.

Tags:    
Advertisement

Similar News