ANR | 100వ జయంతి.. అక్కినేనికి ఘన నివాళి

ANR 100th Birth Anniversary celebrations - లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏఎన్నార్ పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Advertisement
Update: 2023-09-20 15:01 GMT

సెప్టెంబర్ 20.. అక్కినేని కుటుంబానికే కాదు, టాలీవుడ్ మొత్తానికి... ఆ మాట కొస్తే ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ఇది ప్రత్యేకమైన రోజు. దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి ఈరోజు. ఈ వేడుకల్ని అక్కినేని కుటుంబం ఘనంగా నిర్వహించింది. ప్రత్యేకంగా అన్నపూర్ణ స్టుడియోస్ లో ఏఎన్నార్ పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

ఏఎన్నార్ కు అన్నపూర్ణ స్టుడియోస్ అంటే ఎంతో ఇష్టం. స్టుడియోలో ప్రతి ప్రాంతం అక్కినేనికి తెలుసు. ఆయనకు బాగా ఇష్టమైన ఓ లొకేషన్ కూడా ఉంది. సరిగ్గా అక్కడే ఏఎన్నార్ విగ్రహాన్ని ప్రతిష్టించింది అక్కినేని కుటుంబం. ఈ వేడుక ఘనంగా జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు.

గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకలో నాగార్జున కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా పాల్గొన్నారు. మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌, నాని, రాజమౌళి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీళ్లతో పాటు.. బ్రహ్మానందం, జగపతిబాబు, జయసుధ, మోహన్‌బాబు లాంటి చాలామంది ప్రముఖులు విగ్రహావిష్కరణకు హాజరయ్యారు.

అక్కినేనితో తమకున్న అనుబంధాన్ని కొంతమంది పంచుకోగా.. మరికొంతమంది ఏఎన్నార్ గొప్పదనాన్ని కీర్తించారు. తెలుగు చిత్ర పరిశ్రమను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన లెజెండరీ నటుడు అక్కినేని. ఎన్నీఆర్, ఏఎన్నార్ ను టాలీవుడ్ కు రెండు కళ్లుగా చెబుతారు. మరీ ముఖ్యంగా చెన్నై కేంద్రంగా ఉన్న చిత్రసీమను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఏఎన్నార్ చాలా కృషిచేశారు. దీంతోపాటు ఆయన నటించిన సినిమాలు కొన్ని ఆణిముత్యాలు. తుది శ్వాస వరకు సినిమానే లోకంగా బతికిన ఏఎన్నార్.. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నన్ని రోజులు జీవించే ఉంటారు. ఏఎన్నార్ లివ్స్ ఆన్..




Tags:    
Advertisement

Similar News